ఈనెల 7, 8 తేదీలలో దర్శన వేళలో మార్పు

VSP: ఈనెల 7వ తేది చంద్రగ్రహణం సందర్భంగా సింహాచలం దర్శన వేళలో మార్పు చేసినట్లు ఈఓ త్రినాథరావు తెలిపారు. 7వ తేది ఉదయం 11:30 తర్వాత స్వామి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 7, 8తేదీలలో దేవాలయంలో ప్రతి రోజు నిర్వహించే ఆర్జిత సేవలు రద్దు చేశారు. తిరిగి 8వ తేది ఉదయం 8గంటల నుంచి స్వామి వారి దర్శనాలు ప్రారంభిస్తారు.