రిజర్వాయర్ తలపించేలా ఉన్న రైల్వే అండర్ పాస్

SKLM: పొందూరు మండలం పెనుబర్తి నుంచి గోరింట మీదుగా వెళ్లే రహదారి మార్గం రైల్వే అండర్ పాస్ వద్ద రిజర్వాయర్ తలిపించేలా నీరు ఉంది. ఊట నీరు ఇలా చేరుకుంటుందని స్థానికులు అంటున్నారు. దీంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను క్లియర్ చేయాలని వారు కోరుతున్నారు.