సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్ కేసులో మరొకరు అరెస్ట్

HYD: సరూర్‌నగర్ కిడ్నీ రాకెట్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖకు చెందిన డాక్టర్ వెంకటరామసంతోష్ నాయుడును పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ24గా నాయుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయినవారి సంఖ్య 19కి చేరింది.