వైభవంగా అష్టశత వారోత్సవాలు

వైభవంగా అష్టశత వారోత్సవాలు

VZM: దివంగత డాక్టర్ వడలి సూర్యనారాయణమూర్తి-కామేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో ప్రారంభించబడిన భజగోవిందం కార్యక్రమం ఎనిమిది వందల ఒకటిగా నిర్వహించబడుతున్న సందర్భంగా శనివారం అష్ట శతవారోత్సవాలు వైభవంగా జరిగాయి. వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు రమేష్ రాజు ఇంటి వద్ద నుంచి సీతారామ స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.