VIDEO: పెండేకల్లు డ్యాం నుంచి నీటి విడుదల
ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి బుధవారం పెండేకల్లు డ్యాం నుంచి సాగునీటిని విడుదల చేయించారు. మార్చి నెలలోనే భూగర్భ జలాలు అట్టడుగుకు చేరడంతో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు. జేసీబీలు, ట్రాక్టర్ల సాయంతో కాలువల పూడికతీత పనులు పూర్తి చేయించి నీటిని వదిలేలా చొరవ తీసుకున్నారు.