రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

NTR: జగ్గయ్యపేటలో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నందిగామ నుంచి జగ్గయ్యపేట వస్తున్న ఓ బైక్‌ను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో జగ్గయ్య పేటకు చెందిన సాయి మృతిచెందగా.. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.