మహాశివరాత్రి ఉత్సవాలకు ముమ్మరంగా ఏర్పాట్లు

SRPT: తుంగతుర్తి మండల కేంద్రంలోని మహాదేవర లింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు బుధవారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మాజీ సర్పంచ్ సంకినేని స్వరూప రవీందర్ రావు ఆధ్వర్యంలో ఆలయానికి గేట్లు, విద్యుత్ లైట్లు, రంగులతో తీర్చి దిద్దుతున్నారు. స్వామివారికి అభిషేకాలు, పూజలు, హోమంతో పాటు రాత్రి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు.