ఎమ్మెల్యేతో తన గోడు వెల్లబోసుకున్న వృద్ధురాలు
RR: నందిగామ మండల కేంద్రానికి వెళ్లిన MLA వీర్లపల్లి శంకర్‌తో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు తన గోడును వెల్లబోసుకున్నారు. రేషన్ కార్డు, ఇల్లు, పెన్షన్ ఏమి లేదని వివరించగా MLA చలించి పోయారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. జూన్ 2 తేదీ నాటికి పెన్షన్ అందించే ఏర్పాటు చేస్తామని, డబల్ బెడ్ రూమ్ ఇల్లును అందజేయనున్నట్లు తెలిపారు. పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఉందన్నారు.