ఒమన్ మార్గంలో హర్మూజ్‌ను దాటిన నౌకలు
హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నియంత్రణలో ఉన్న మార్గంలో కాకుండా ఇతర మార్గంలో ఒమన్ నౌకలు ప్రయాణించాయి. ఒమన్ తీరానికి అత్యంత సమీపం నుంచి మూడు నౌకలు హర్మూజ్‌లోకి ప్రవేశించాయి. రెండు భారీ చమురు సూపర్ ట్యాంకర్లు, ఒక LNG క్యారియర్ కలిగిన ఈ నౌకలు ఒమన్ మార్గంలో హర్మూజ్‌ను దాటినట్లు షిప్పింగ్ జర్నల్ 'లాయిడ్ లిస్ట్' వెల్లడించింది.