గేమింగ్ యాప్స్ కంపెనీలపై ఈడీ దాడులు

గేమింగ్ యాప్స్ కంపెనీలపై ఈడీ దాడులు

ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ కంపెనీలపై ఈడీ దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఏకకాలంలో 11 ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి. ఇందులో బెంగళూరులో 5 చోట్ల, ఢిల్లీలో 4 చోట్ల, గురుగ్రామ్‌లో 2 చోట్ల సోదాలు చేశారు. క్రిప్టో కరెన్సీ ద్వారా కంపెనీ ప్రమోటర్లు మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. యాప్ నిర్వాహకుల ఇళ్లలోనూ ఈ సోదాలు కొనసాగుతున్నాయి.