అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
KMM: చింతకాని మండలంలోని చిన్నమండవ, తిమ్మినేనిపాలెంతోపాటు ముదిగొండ మండలం వల్లాపురం మున్నేటి నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న తొమ్మిది ట్రాక్టర్లను పట్టుకుని, పోలీస్ స్టేషన్‌కు తరలించమని సీఐ వెంకటప్రసాద్ తెలిపారు. మున్నేటి నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక దాడులు నిర్వహించారు.