మాజీ సీఎం జగన్‌ను కలిసిన అరకు ఎమ్మెల్యే
ASR: తాడేపల్లిలో మాజీ సీఎం జగన్‌తో మంగళవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం భేటీ అయ్యారు. ఎమ్మెల్యేతో పాటు అరకు అసెంబ్లీ ఆరు మండలాల వైసీపీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు రేగం చాణిక్య ఉన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పార్టీ అధినేతకు కూలంకషంగా ఎమ్మెల్యే వివరించారు.