పార్టీ నాయకున్ని పరామర్శించిన ఎమ్మెల్యే
NLG: దేవరకొండ మండలం మైనంపల్లి కొర్రతండాకు చెందిన కాంగ్రెస్ నాయకుడు శంకర్ నాయక్ రోడ్డు ప్రమాదంలో గాయలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఎమ్మెల్యే బాలునాయక్ శంకర్‌ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్య అధికారులకు సూచించారు. వారితో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య గౌడ్ పాల్గొన్నారు.