జర్మనీలో ఉద్యోగావకాశాలకు ఆహ్వానం

సత్యసాయి: నర్సింగ్ కోర్సులు పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీలో ఉద్యోగావకాశాల కోసం 8–10 నెలల జర్మన్ భాష శిక్షణను ప్రభుత్వం చితంగా అందించనుందని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి జి. రెడ్డి బాలాజీ తెలిపారు. 35 ఏళ్లలోపు వారు అర్హులని అన్నారు. ఆసక్తి గల వారు ఆగస్టు 10లోపు ఆధార్, విద్యార్హతల పత్రాలతో dscweo.sss@gmail.comకు మెయిల్ చేయాలని సూచించారు.