VIDEO: ఘనంగా పంచమ జ్యోతుల మహోత్సవం
సత్యసాయి: సోమందేపల్లిలో చేనేతల కులదేవత శ్రీ చౌడేశ్వరి అమ్మవారి పంచమజ్యోతి మహోత్సవం శుక్రవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్త డీసీ ఈశ్వరయ్య ఆలయంలో తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించి జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుని జ్యోతుల కార్యక్రమం వీక్షించారు.