కార్తీక వనసమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే

కార్తీక వనసమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: మొగల్తూరు మండలం ముత్యాలపల్లి శ్రీ ముత్యాలమ్మ ఆలయం వద్ద అగ్నికుల క్షత్రియ నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసం మన ఆధ్యాత్మికతకు ప్రతీక అని అన్నారు. అలాగే ఈ పవిత్ర కాలం మనలో భక్తి, ఐక్యత, ఆచార సంప్రదాయాల పట్ల గౌరవభావాన్ని పెంపొందిస్తుందన్నారు.