'FRS ద్వారా హాజరు నమోదు కట్టుదిట్టంగా నమోదు చేయాలి'

KMM: ఉపాధ్యాయులకు FRS ద్వారా హాజరు నమోదు కట్టుదిట్టంగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో FRS విధానంలో హాజరు నమోదుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. పాఠశాలకు విద్యార్థులు గైర్హాజరైతే రెగ్యులర్ ఫాలో అప్ చేయాలని చెప్పారు. టీచర్లు, విద్యార్థుల హాజరు అంశం అత్యంత ప్రాధాన్యతగా పరిగణించడం జరుగుతుందన్నారు.