అటవీ ప్రాంతంలో లారీ దగ్ధం

అటవీ ప్రాంతంలో లారీ దగ్ధం

KMM: రోళ్లపాడు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ లారీ దగ్ధమైంది. పోలీసుల కథనం ప్రకారం.. ఇల్లందు నుంచి కొత్తగూడెం వైపునకు వెళ్తున్న ఓ లారీ మండల పరిధిలోని రోళ్ళపాడు అటవీ ప్రాంతంలో అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ అందులో లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.