మహిళా సాధికారితకు ప్రతీక సరోజినీ దేవి: మంత్రి
కోనసీమ: భారత స్వాతంత్ర పోరాటంలో అపారమైన సేవలు అందించి, భారతదేశపు తొలి మహిళా గవర్నర్‌గా చరిత్రలో నిలిచిన కవయిత్రి సరోజిని దేవి నాయుడు జయంతి సందర్భంగా శుక్రవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఘన నివాళులు అర్పించారు. సరోజిని దేవి నాయుడు జీవితమే మహిళా సాధికారతకు, దేశభక్తికి ప్రతీక అని కొనియాడారు. స్వాతంత్ర సమరంలో ఆమె పోషించిన పాత్ర చిరస్మరణీయమన్నారు.