'కలెక్టర్ రాజర్షి షాను కలిసిన ఎన్నికల పర్యవేక్షకులు'

'కలెక్టర్ రాజర్షి షాను కలిసిన ఎన్నికల పర్యవేక్షకులు'

ADB: జిల్లాలో జరుగనున్న పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నియమితులైన ఎన్నికల సాధారణ పరిశీలకులు వెంకన్న, వ్యయ పరిశీలకులు విజయ గురువారం కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. నిబంధనల అమలు, వెబ్‌కాస్టింగ్, వ్యయ పరిమితులపై కలెక్టర్‌తో వారు చర్చించారు.