చెత్త సేకరణ నిత్యం చేపట్టాలి : ZP CEO

చెత్త సేకరణ నిత్యం చేపట్టాలి : ZP CEO

NLR: గ్రామాల్లో పారిశుద్ధ్య లోపంపై ZP CEO మోహన్ రావు తీవ్ర అసహనం చెందారు. పారిశుద్ధ్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ఇవాళ సీతారామపురం (M) గుండుపల్లి పంచాయతీని ఆయన సందర్శించారు. IVRS కాల్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో చెత్త సేకరణ నిత్యం చేపట్టాలని ఆదేశించారు.