పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ

బీహార్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ.13 వేల కోట్లు విలువైన విద్యుత్, రహదారులు, వైద్యానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గయా నుంచి ఢిల్లీకి, వైశాలి నుంచి కోడెర్మా మధ్య నడిచే రెండు రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. 12 వేల మంది లబ్ధిదారులకు PMAY-గ్రామీణ్ పథకం కింద ఇంటి తాళాలను అందజేశారు.