జాతీయ క్రీడలకు కుల్కచర్ల విద్యార్థి ఎంపిక
VKB: కుల్కచర్లకు చెందిన క్రీడాకారుడు పార్థసారథి రాష్ట్రస్థాయి పెన్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి, నవంబర్ 15న ఢిల్లీలో జరగబోయే నేషనల్ పెన్సింగ్ పోటీలకు ఎంపికయ్యారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు జాతీయ స్థాయిలో రాణించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర పెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతను క్రీడాకారులుగా మారుస్తున్నామన్నారు.