డెత్ సర్టిఫికెట్ జారీలో అధికారుల నిర్లక్ష్యం.. రీల్ వైరల్
HYD: హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ అధికారుల తీరుపై ఓ యువకుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన తాత డెత్ సర్టిఫికెట్ కోసం నెలన్నర రోజులుగా తిరుగుతున్నా, అధికారులు 'రేపు, మాపు' అంటూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన చెందాడు. దీనికి సంబంధించిన రీల్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా చార్మినార్ జోన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని యువకుడు వీడియోలో కోరాడు.