ప్రమాదకరంగా ప్రయాణం

ప్రకాశం: పొదిలి పరిసర ప్రాంతాల్లో ఇటీవల కూలీ పనులు జోరందుకున్నాయి. దీంతో ఆటోల్లో పరిమితికి మించి కూలీలను ఒక చోటు నుంచి మరో చోటకు తరలిస్తున్నారు. కాగా పోలీసులు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లవద్దని నిత్యం అవగాహన కల్పిస్తున్నా కొందరు మారడం లేదు. మహిళలు ప్రమాదకరంగా పనులకు వెళ్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన నెలకొంది.