కుంటాల మండలంలో భూభారతి పైలెట్ ప్రాజెక్టు

NRML: భూభారతి పైలెట్ ప్రాజెక్టుకు కుంటాల మండలం ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. మండలంలోని 16 గ్రామాలలో రేపటినుండి 20వ తేదీ వరకు రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తామని, రైతులు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమం కొరకు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.