దారుణం.. భర్తను కొట్టి చంపిన భార్య

దారుణం.. భర్తను కొట్టి చంపిన భార్య

MLG: వెంకటాపురం మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని వాడగూడెం గ్రామంలో లక్ష్మీ అనే మహిళ తన భర్త బాబురావును(55) తలపై కర్రతో కొట్టి చంపింది. ఇంట్లోనే మృతదేహాన్ని దాచి పెట్టింది. అయితే దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అసలు విషయం బయటపడింది. దీంతో కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.