చెరువుగట్టు దేవాలయంలో 8న వివిధ సేవల వేలం

చెరువుగట్టు దేవాలయంలో 8న వివిధ సేవల వేలం

చెరువుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 2026-27 సంవత్సరానికి గాను బహిరంగ వేలం, సీల్డ్ టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆలయ EO ఎస్. మోహన్ బాబు తెలిపారు. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11 గంటలకు ఆలయ కార్యాలయం వద్ద కిరాణా సామగ్రి విక్రయం, ఇనుప సామగ్రి సేకరణ వంటి హెచ్-1 వేలంతో పాటు ఎల్-1 టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు.