గండ్లు పడిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయండి..!
BPT: పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శనివారం నాగులపాలెంలో పర్యటించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పొలాలకు వెళ్లే దారి రోడ్లకు గండ్లు పడటంతో రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. రైతులు అధైర్య పడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.