సర్పంచ్, ఉప సర్పంచ్‌పై కేసు నమోదు..!
SRCL: చందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయ ఛైర్మన్ పదవి విషయంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌తో తర్రే చంద్రశేఖర్‌ల మధ్య గొడవ తలెత్తింది. తనను కులం పేరుతో దూషించారని చంద్రశేఖర్ ఫిర్యాదుతో సర్పంచ్ నరేష్, ఉప సర్పంచ్ ఎల్లయ్య, సుంకి వేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎస్సై నమోదు చేశారు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో లింగంపేటలో విచారణ చేపట్టారు.