రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు

భద్రాద్రి జిల్లా పినపాక మండలం దుగినేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.