అధికార పార్టీ గెలిస్తేనే గ్రామ అభివృద్ధి సాధ్యం: మంత్రి
ములుగు జిల్లా పోగుళ్లపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నూనావత్ ఈరియా నాయక్ (ఉంగరం గుర్తు)ను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరారు. అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తేనే గ్రామాభివృద్ధి సాధ్యమని, పథకాలు సక్రమంగా అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు ఉన్నారు