శిథిలావస్థకు చేరిన హంద్రీ వంతెన

KRNL: దేవనకొండ మండలంలోని అలారుదిన్నె వద్ద హంద్రీ వంతెనపై రెయిలింగ్ కూలిపోవడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం వాహనదారులు మాట్లాడుతూ.. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరిందని, రోడ్డుపై గుంతలు ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.