నేడు విజయవాడలో చంద్రబాబు పర్యటన

నేడు విజయవాడలో చంద్రబాబు పర్యటన

AP: విజయవాడలో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకొని.. టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. తిరువూరు వ్యవహారంతోపాటు పలు నియోజకవర్గాల్లో పార్టీ నేతల ఆధిపత్య పోరుపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే, కూటమి పార్టీల సమన్వయం, టీడీపీ కమిటీలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.