జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా డాక్టర్.అమూల్య

శ్రీకాకుళం: ప్రభుత్వ సర్వజనాసుపత్రి సూపరింటెండెంట్‌గా డా.అమూల్య నియమితులయ్యారు. ఈమె విశాఖ కేజీహెచ్‌లో గైనకాలజీ విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన డా.స్వామి నాయుడు ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానంలో డా.షకీలాకు అదనపు బాధ్యతలు అప్పగించారు ఖాళీగా ఉన్న ఆ స్థానంలో అమూల్య రెగ్యులర్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించినున్నారు.