రేపు హిందుపురంలో టీడీపీ పార్లమెంట్ కమిటీ సమావేశం

సత్యసాయి: హిందూపురం టీడీపీ పార్లమెంట్ కమిటీ సమావేశం రేపు ఉదయం 9 గంటలకు పుట్టపర్తిలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జరుగనుంది. ఈ సమావేశానికి మంత్రి టీజీ భరత్, ఉమా మహేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారు. పార్టీ నాయకులు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.