'పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత'
MHBD: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మరిపెడ పట్టణంలో చేపడుతున్న పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించి పలు సూచనలను చేశారు. పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ.. ముందుకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు.