ఎంపీడీవోగా మంగతాయారు బాధ్యతలు స్వీకరణ

E.G: నల్లజర్ల మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నూతన ఎంపీడీవోగా మంగతాయారు బాధ్యతలు చేపట్టారు. గ్రామ సెక్రటరీలు ఎంపీడీవో మంగతాయారును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలందించేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు.