పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు
PPM: ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను గజరాజులు ధ్వంసం చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కొమరాడ మండలం కుమ్మరి గుంట గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాలలో శుక్రవారం రాత్రి ఏనుగులు గుంపు ప్రవేశించి వరి, కూరగాయల పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించాలని కోరుతున్నారు.