ఢిల్లీ పేలుడు మృతులకు కేంద్ర కేబినెట్ సంతాపం
ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ ఖండించింది. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపింది. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. తర్వాత ఉగ్రవాదంపై పోరు కొనసాగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితిలో సహించమని.. వారిని చట్టం ముందు నిలబెడతామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.