సీఐ నరేష్ బాబు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు

సీఐ నరేష్ బాబు ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు

KDP: కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఎర్రగుంట్ల ఆర్టీసీ బస్టాండ్, బస్సులలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పోలీసు బృందాలచే అనుమానితుల, వారి లగేజీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ తనిఖీలు చేపట్టినట్టు యర్రగుంట్ల సీఐ నరేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.