పాఠశాలలో ఆరోగ్య దినోత్సవ వేడుకలు
SRCL: చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారంప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సిరిసిల్ల నర్సింగ్ కళాశాల విద్యార్థులు విద్యార్థులలో ఆరోగ్యంపై చైతన్యం పెంపొందించారు. ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకోవడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.