ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

BHPL: గణపురం మండలం చెల్పూర్ గ్రామంలోని కేటీపీపీ ప్రధాన గేటు ముందు మెయిన్ రోడ్డు పై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో థర్మల్ పవర్ ప్లాంట్ లో పనిచేసే ఉద్యోగి రమేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.