అమలాపురంలో బాలిక కిడ్నాప్ కలకలం
కోనసీమ: అమలాపురం బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. ఐమాండ్ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్న బాలికను నిన్న సాయంత్రం మట్టపర్తి మీరా సత్యమూర్తి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిషితకు దూరపు బంధువుగా గుర్తించారు. గతంలో అతనిపై నేరారోపనణలు ఉన్నట్లు తెలిపారు. బాలికతో పారిపోతూ కాకినాడలో కొత్త ఫోన్ కొనే ప్రయత్నం చేసినట్టు సమాచారం. పోలీసులు బాలిక కోసం గాలిస్తున్నారు.