కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య!

కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య!

KRNL: పదో తరగతి పరీక్షల్లో తన కుమారుడు భరతాబాబు ఫెయిల్ అయ్యాడని మనస్థాపంతో తల్లి లక్ష్మీజ్యోతి (39) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గురువారం కర్నూలులో చోటు చేసుకుంది. భర్త రవి, ఇద్దరు పిల్లలతో ఉన్న లక్ష్మీజ్యోతి, ఫలితాలు రావడంతో ఇంట్లో చీరతో ఉరేసుకుంది. భర్త గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.