VIDEO: వాతావరణంలో మార్పు.. కురిసిన వర్షం
కోనసీమ: రావులపాలెం మండలంలో సోమవారం ఉదయం వాతావరణంలో హఠాత్తుగా మార్పు చోటుచేసుకుంది. ఆకాశం దట్టమైన మేఘాలతో నిండిపోయి మోస్తరు వర్షం కురుస్తోంది. దీనితో రైతులు తమ పంటలకు నష్టం వాటిల్లుతుండెమో అని ఆందోళన చెందుతున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.