నీలకంఠాపురంలో శ్రీరామనవమి వేడుకల పోస్టర్ల విడుదల

నీలకంఠాపురంలో శ్రీరామనవమి వేడుకల పోస్టర్ల విడుదల

సత్యసాయి: మడకశిర మండలం నీలకంఠాపురంలో ఈనెల 27 నుంచి మూడు రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్ రఘువీరారెడ్డి మంగళవారం ఈ ఉత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. 28న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, సామూహిక వివాహాలు జరగనున్నాయి. కల్యాణం కోసం వినియోగించే తలంబ్రాల తయారీకి రఘువీరారెడ్డి గ్రామస్థులకు వడ్లను పంపిణీ చేశారు.