టారిఫ్ వివాదం.. నేడు అమెరికా, భారత్ మధ్య చర్చలు

భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఇవాళ జరగనున్నాయి. ఈ చర్చల కోసం అమెరికా ప్రతినిధి బృందం నిన్న రాత్రి భారత్‌కు చేరుకుంది. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య టారిఫ్‌ల విషయంలో విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధిస్తోంది. ఈ చర్చల్లో వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించడంపై రెండు దేశాలు దృష్టి పెట్టనున్నాయి.