విజిలెన్స్, పోలీసులతో TTD అదనపు EO సమీక్ష

AP: విజిలెన్స్, జిల్లా పోలీసులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాల భద్రత ఏర్పాట్లపై అన్నమయ్య భవనంలో చర్చించారు. టీటీడీ, విజిలెన్స్, పోలీసులు ప్రణాళిక ప్రకారం వెళ్లాలని సూచించారు. ప్రజారవాణా ద్వారా తిరుమలకు భక్తులను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గరుడ వాహనం రోజున టైమ్ మేనేజ్‌మెంట్ విధానం అమలు చేయాలని తెలిపారు.