ఉపాధ్యాయుడిగా మారిన మున్సిపల్ కమిషనర్

ఉపాధ్యాయుడిగా మారిన మున్సిపల్ కమిషనర్

KNR: హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య శుక్రవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించి ఉపాధ్యాయుడిగా మారారు. వంద రోజుల పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అనంతరం, ఆయన ప్రతాపవాడలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు గణితం, ఆంగ్లం పాఠాలు చెప్పారు. అలాగే, నైతిక విలువలపై కథలు, తెలుగు అక్షరాలను ఎలా పలకాలో వివరించారు.